తెలంగాణ

telangana

By

Published : Nov 18, 2021, 1:31 PM IST

ETV Bharat / priya

కొబ్బరిపాలతో చికెన్ పులావ్​.. రుచి చూస్తే అంటారు వావ్​!

బిర్యానీలు తినీ తిని బోర్ కొట్టేసిందా? అయితే ఎంచక్కా 'కొబ్బరిపాలతో చికెన్​ పులావ్'​ తయారు చేసుకోండి. వేడివేడిగా ఉన్నప్పుడే దీన్ని ఆరగిస్తే.. నాన్​వెజ్​ ప్రియులు ఎవరైనా సరే వావ్ అనాల్సిందే!

kobbari palu chicken pulav recipe
కొబ్బరిపాలతో చికెన్ పులావ్​

బాస్మతి బియ్యం, కొబ్బరిపాలు, చికెన్​తో సులభంగా, చాలా రుచికరంగా చేసుకునే తేలికైన వంటకం 'కొబ్బరిపాలు చికెన్​ పులావ్‌'(mushroom recipes). దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు

  • చికెన్ ముక్కలు
  • ఉల్లిపాయలు
  • జీలకర్ర
  • మిరియాలు
  • కరివేపాకు
  • నూనె
  • అల్లం
  • బంగాళదుంప ముక్కలు
  • క్యారెట్​ ముక్కలు
  • క్యాప్సికమ్ ముక్కలు
  • ఉప్పు
  • పచ్చిమిర్చి
  • కొబ్బరి పాలు
  • బాస్మతి బియ్యం

తయారీ విధానం

ముందుగా.. గిన్నెలో కొంచెం నూనె వేసి, జీలకర్ర, మిరియాలు సన్నగా తరిగిన అల్లం, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగన ఉల్లిపాయలు, చికెన్​ ముక్కలు వేసి, ఒక రెండు నిమిషాలపాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత.. ఒక కప్పు బియ్యానికి రెండున్నర కప్పులు నీళ్ల చొప్పున వేసుకుని, దాంట్లో ఉప్పు, కట్​ చేసిన బంగాళదుంప, క్యారెట్ ముక్కలు వేసి కుక్ చేసుకోవాలి.

కొబ్బరిపాలతో చికెన్ పులావ్​

చికెన్​ కొంచెం ఉడికిన తర్వాత.. అందులో పచ్చిమిరపకాయలు, బాస్మతి రైస్ కూడా వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. దాంట్లో తేమంతా పీల్చుకున్న తర్వాత.. చివర్లో కొబ్బరి పాలు వేసి, క్యాప్సికమ్ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసి, మూత పెట్టి తక్కువ మంటలో మరో నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ ఆపేసిన ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి, వేడివేడిగా బీట్​రూట్​ రైతాతో వడ్డించుకుంటే.. చాలా రుచిగా ఉండే 'కొబ్బరిపాలు చికెన్ పులావ్' తినేందుకు రెడీ.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details