మ్యాంగో లస్సీ
కావాల్సినవి:
పెరుగు - 125 మి|| లీ||
చల్లని నీళ్లు - 200 మి|| లీ||
ఐస్ క్యూబ్స్ - 8
మామిడి పండు - ఒకటి (తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి)
చక్కెర - టేబుల్ స్పూన్
తయారీ:
ముందుగా మామిడి పండు ముక్కలు, చక్కెర, పెరుగు మిక్సీలో వేసుకొని మెత్తని ప్యూరీలా చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో నీళ్లు పోసుకుంటూ మరీ పల్చగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా తయారుచేసుకోవాలి. కావాలంటే మిక్సీ పట్టేటప్పుడే ఐస్ ముక్కలు వేసుకోవచ్చు. లేదంటే మొత్తం పూర్తయ్యాక ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేసినా బాగుంటుంది.
బనానా వాల్‌నట్ లస్సీ
కావాల్సినవి:
పెరుగు - కప్పు
అరటి పండు - సగం
వాల్‌నట్స్ - నాలుగు
గింజలు - టీస్పూన్ (నువ్వులు, అవిసె గింజల్లాంటివి వేసుకోవచ్చు)
తేనె - రెండు టీస్పూన్లు
తయారీ:
ముందుగా వాల్‌నట్స్‌ని చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో పెరుగు, వాల్‌నట్స్, నువ్వులు, అవిసె గింజలు, తేనె, అరటి పండ్లు వేసి మెత్తని మిశ్రమంగా చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని గ్లాసులో పోసుకొని అరటి పండు ముక్కలతో గార్నిష్ చేస్తే సరి..
స్ట్రాబెర్రీ లస్సీ
కావాల్సినవి:
స్ట్రాబెర్రీలు - 9-10
చక్కెర - రెండు టేబుల్ స్పూన్లు
పాలు - పావుకప్పు
పెరుగు - కప్పు
ఐస్ క్యూబ్స్ - మూడు
తయారీ:
ముందుగా స్ట్రాబెర్రీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆపై వాటిని మిక్సీలో వేసి చక్కెర జత చేసి మెత్తని మిశ్రమంగా చేసుకోవాలి. ఇందులో పాలు, పెరుగు వేసి ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఐస్‌క్యూబ్స్ కూడా వేసి మరోసారి మిక్సీ పట్టి గ్లాసుల్లో పోసి సర్వ్ చేసుకోవాలి. కావాలంటే పైన యాలకుల పొడి చల్లుకోవచ్చు లేదా స్ట్రాబెర్రీ ముక్కలతో అలంకరించుకోవచ్చు.
యాపిల్ లస్సీ
కావాల్సినవి:
యాపిల్ - ఒకటి
పెరుగు - కప్పు
నీళ్లు - అరకప్పు
చక్కెర - నాలుగు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - పావు టీస్పూన్
తయారీ:
ముందుగా యాపిల్‌ని కడిగి, తొక్క చెక్కేసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ యాపిల్ ముక్కలను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆపై అందులో పెరుగు, చక్కెర, యాలకుల పొడి, పావు కప్పు నీళ్లు వేసి మరోసారి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మిశ్రమం బాగా చిక్కగా ఉంటే మరో పావు కప్పు నీళ్లను కలుపుకోవాలి. ఆపై ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే సరి..
మసాలా లస్సీ
కావాల్సినవి:
పెరుగు - అర లీటర్
పచ్చి మిర్చి - రెండు
అల్లం ముక్క - అంగుళం
ఉప్పు - టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
ఛాట్ మసాలా - అర టీస్పూన్
పుదీనా ఆకులు - పది
జీలకర్ర పొడి - అర కప్పు
చల్లని పాలు - అర కప్పు
చల్లని నీళ్లు - కప్పు
కోవా - రెండు టేబుల్ స్పూన్లు
క్రీం - రెండు టేబుల్ స్పూన్లు
ఐస్‌క్యూబ్స్ - నాలుగైదు
తయారీ:
ముందుగా పచ్చిమిర్చి, అల్లం, పుదీనా ఆకులు, మిరియాల పొడి, జీలకర్ర పొడి కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అందులో పాలు, పెరుగు, క్రీం వేసుకొని మళ్లీ మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఉప్పు, ఛాట్ మసాలా వేసి నీళ్లు కలిపి మరోసారి మిక్సీ పట్టి తీసేయాలి. ఇందులో కోవా, ఐస్‌క్యూబ్స్ వేసి బాగా కలిపి డ్రైఫ్రూట్స్, ఛాట్‌మసాలా వేసి సర్వ్ చేస్తే సరి..
ఇదీ చూడండి:మా పాపకి ఆ విషయాల గురించి చెప్పొచ్చా?