తెలంగాణ

telangana

ETV Bharat / priya

క్యాప్సికం- పల్లీలతో కొత్త రెసిపీ.. ట్రై చేయండిలా!

క్యాప్సికంతో కొత్తరకం కర్రీలు చేయాలనుకునే వారు ఈ వంటకాన్ని ట్రై చేసుకోవచ్చు. అయితే అది ఎలా చేయాలి? ఆ వంటకం ఏంటి?

capsicum
క్యాప్సికం కర్రీ

By

Published : Sep 7, 2021, 5:25 PM IST

క్యాప్సికంలో ఎన్నో పోషకాలుంటాయి. క్యాన్సర్​ ముప్పును తగ్గించడంలో, గుండె ఆరోగ్యానికి క్యాప్సికం చాలా మంచింది. అలాంటి క్యాప్సికంతో అనేక వెరైటీలను చేయొచ్చు. ఇప్పుడు కొంచెం వెరైటీగా ఉండే క్యాప్సికం పల్లీ వేపుడు ఎలా చేయాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు..

క్యాప్సికం ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు -1కప్పు, పచ్చి శెనగపప్పు- 1కప్పు, జీలకర్ర -1టీ స్పూన్, పల్లీలు -1కప్పు, నువ్వులు- 3 టీస్పూన్లు, కారం- 1టీస్పూన్, ధనియాల పొడి- 1టీస్పూన్, కొబ్బరి పొడి- 2టీ స్పూన్లు, ఉప్పు- తగినంత, నూనె- 1కప్పు

తయారీ విధానం..

ముందుగా స్టవ్​ ఆన్​ చేసుకొని ప్యాన్​ పెట్టుకొని అందులో పచ్చి శెనగపప్పు, పల్లీలు, నువ్వులు వేయించి మిక్సీ జార్​లోకి తీసుకొని మిక్సి పట్టి పక్కనపెట్టుకోవాలి. అదే ప్యాన్​లో నూనె వేసి నూనె వేడెక్కాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి కాస్త వేయించి.. ముందుగా మిక్సి పట్టుకున్న పల్లీల పౌడర్​ వేసి, తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత కొబ్బరి పొడి కూడా వేసి రెండు నిమిషాల పాటు వేయించి సర్వింగ్ బౌల్​లోకి తీసుకొని.. సర్వ్ చేసుకుంటే క్యాప్సికం పల్లీ వేపుడు రెడీ.

ఇదీ చూడండి:చిల్లీ పన్నీర్.. సాయంత్రం వేళ గరంగరంగా!

ABOUT THE AUTHOR

...view details