శరణార్థుల ముసుగులో మయన్మార్ నుంచి ఇండియాలోకి(Myanmar militants in india) ముష్కరులు చొరబడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు కొన్నాళ్లుగా వినవస్తున్నాయి. ఆ విద్రోహుల మూలంగా మణిపుర్‌లో(Violence in north east india) మళ్ళీ హింస ప్రకోపించవచ్చుననే భయాందోళనలూ నెలకొన్నాయి. వాటిని నిజంచేస్తూ- ఆ రాష్ట్రంలోని(Manipur attack news) చురాచాంద్‌పుర్ జిల్లాలో కర్నల్ విప్లవ్ త్రిపాఠి వాహనశ్రేణిపై మెయ్‌తెయ్ తిరుగుబాటుదారులు భీకరదాడికి తెగబడ్డారు. త్రిపాఠితో పాటు ఆయన భార్యాబిడ్డలు, మరో నలుగురు సైనికులను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నారు. ఈశాన్యభారతంలో(Violence in north east india) తిష్ఠవేసిన వందల కొద్దీ విద్రోహ బృందాలు- దశాబ్దాలుగా అక్కడ నెత్తుటేళ్లు పారించాయి.
12వేల మంది విగతజీవులుగా..
గడచిన ఇరవై ఏళ్లలో ఆ రాష్ట్రాల్లో 26వేలకు పైగా ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాలు, పౌరులు, తిరుగుబాటుదారులతో కలిపి సుమారు పన్నెండు వేల మంది విగతజీవులయ్యారు. మయన్మార్ సైనిక సహకారంతో భారత బలగాలు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ల ఫలితంగా కొన్నేళ్లుగా ముష్కర మూకల కార్యకలాపాలు తగ్గుతూ వస్తున్నాయి. నాగా, కుకీ, కర్బీ, జొమీ వర్గాలకు చెందిన దాదాపు ఇరవై తిరుగుబాటు బృందాలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. సయోధ్య ఒప్పందాలూ కుదుర్చుకుంటున్నాయి. శాంతి, సామరస్యాలకు ఒప్పుకోని మణిపురీ ఉగ్రమూకలు మాత్రం విధ్వంసకాండకు(Violence in north east india) పాల్పడుతున్నాయి. వాటిలో ప్రజావిముక్తి సైన్యం (పీఎల్‌ఏ), మణిపుర్ నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎంఎన్‌పీఎఫ్) తాజా దాడికి(Manipur attack news) బాధ్యత తమదేనని ప్రకటించుకున్నాయి. శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ రాష్ట్రంలో రాజకీయ హింస సైతం పెచ్చరిల్లుతోంది. ఆగ్నేయాసియాతో అనుసంధానంలో కీలకమైన కలాదాన్ ప్రాజెక్టు ఫలాలు సత్వరం అందుబాటులోకి రావాలంటే మణిపుర్‌లో శాంతి స్థాపన అత్యవసరం. చర్చలకు అంగీకరించని ఉగ్రవాద తండాలపై ఉక్కుపాదం మోపితేనే అది సాధ్యమవుతుంది!
డ్రాగన్ కుయుక్తులు..