MLC Jeevan Reddy
LIVE : గాంధీభవన్‌లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
<p><strong>MLC Jeevan Reddy LIVE : </strong>తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ 420 కేసీఆర్, మోసగాడు కేటీఆర్ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. నెల రోజుల్లోనే హామీలను అమలు చేయలేదంటూ, కాంగ్రెస్‌ను 420 అని కేటీఆర్ అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మొదటగా దళితులను మోసం చేశారని మండిపడ్డారు. అనంతరం దళితులకు మూడు ఎకరాల భూమి అని మోసం, ఇలా 'మీరిచ్చిన హామీలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి కేటీఆర్' అంటూ ధ్వజమెత్తారు.</p><p>గత తొమ్మిదేళ్లలో నగరంలో తప్ప ఎక్కడైనా ఇళ్లు కట్టారా అంటూ బీఆర్‌ఎస్‌ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. అలాగే దరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు. గిరిజనులను, దళితులను మోసం చేసిందే బీఆర్‌ఎస్ అని జీవన్ రెడ్డి విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ పేరు పెట్టి తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించే నైతిక హక్కు కేసీఆర్ కోల్పోయారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. </p>
Published : Jan 8, 2024, 1:09 PM IST
|Updated : Jan 8, 2024, 1:30 PM IST
Last Updated : Jan 8, 2024, 1:30 PM IST