తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

రెండో పెళ్లి చేసుకుంటే ఆస్తి వస్తుందా.. రాదా? - special story on second marriage problems

నా స్నేహితురాలు ఒకబ్బాయిని ప్రేమించింది. ఆ పెళ్లికి అబ్బాయి వాళ్ల ఇంట్లోవాళ్లు ఒప్పుకోవడం లేదు. అమ్మానాన్నల ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుని, నా స్నేహితురాలిని రెండో పెళ్లి చేసుకుంటానంటున్నాడు. రెండో భార్యకు చట్ట ప్రకారం అతడి ఆస్తి లేదా సంపాదనలో ఎలాంటి హక్కూ ఉండదని విన్నాను. ఇది ఎంత వరకు వాస్తవం? - ఓ సోదరి

special-story-on-second-marriage-problems
రెండో పెళ్లి చేసుకుంటే ఆస్తివస్తుందా.. రాదా?

By

Published : Jun 10, 2020, 3:47 PM IST

Updated : Jun 10, 2020, 4:02 PM IST

అమ్మానాన్నల కోసం ఒకరిని, ప్రేమకోసం మరొకరిని చేసుకుంటానంటున్నాడంటే ఆ వ్యక్తి ప్రేమలో నిజాయతీ మీకు అర్థం కావడం లేదా? ఏది ఏమైనా మొదటి పెళ్లి మాత్రమే చెల్లుతుంది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ ఐదులో వివాహ చట్టబద్ధతకోసం కొన్ని నిబంధనలు చెప్పారు. మొదటిది పెళ్లి చేసుకోబోయే వారికి ముందే వివాహమై ఉండరాదు. అది చెల్లుబాటు కాదు. సెక్షన్‌ 12 ప్రకారం తాము చేసుకున్నది రెండో పెళ్లి అని తెలిసినప్పుడు ఆ భార్య/భర్త తాము చేసుకున్న వివాహాన్ని రద్దు చేసుకునే హక్కు ఉంది.

రెండో భార్యకి పుట్టిన సంతానం కూడా చట్టబద్ధ వారసుల కిందకి వస్తారు. ఆస్తి విషయాలకొస్తే రెండో భార్యకు ఆస్తిలో హక్కులు ఎప్పటికీ రావు. వాళ్ల పిల్లలకు మాత్రం ఉంటాయి. రెండో భార్య భరణం అడగొచ్చు. అందుకోసం ఆమె తన పెళ్లికి సంబంధించిన ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఇద్దరూ కలిసి జీవించారు. తమకి పిల్లలు ఉన్నారన్న విషయం రూఢీపరచాలి. మీ స్నేహితురాలు తీసుకునే నిర్ణయం మీదే ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

ఇది చూడండి : 'నాలో అభిమానిని తట్టిలేపింది మీరే'

Last Updated : Jun 10, 2020, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details