పిల్లల మానసిక పరిస్థితులను ఊగే ఊయలతో పోల్చవచ్చు. ఎందుకంటే అది ఒక చోట కుదురుగా ఉండదు కదా.. అలానే వారి మూడ్ కూడా క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది. చిన్న విషయాలకే ఎక్కువగా కోపం, విసుగు ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులుగా వారి మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి.
తిట్టొద్దు... కొట్టొద్దు!
అసలే కోపంతో ఉన్న పిల్లలను కోప్పడటమో, కొట్టడమో చేయద్దు. ఇలా చేస్తే అగ్నికి ఆజ్యాన్ని పోసినట్లే అవుతుంది. ఇలాంటి సమయంలో మీరే కొంత సంయమనం పాటించాలి. పిల్లలు కోపంగా ఉన్నప్పుడు మీరు కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత వారి కోపానికి కారణమేంటో కనుక్కోవాలి. వాటిని అప్పటికప్పుడు పరిష్కరించకపోయినా... క్రమంగా వారి భావోద్వేగాలను అదుపుచేసుకోగలిగే సమర్థతను వారికి నేర్పాలి.
అన్నదల్లా తీర్చొద్దు...