ఓ వైపు ఎక్కువ మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. మరోవైపు ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటివాటితో ఇబ్బందిపడుతోన్న స్త్రీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీటిని నియంత్రించుకోవాలంటే క్యాప్సికమ్ తినడం మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు.
క్యాన్సర్ ముప్పు అదుపులో: క్యాప్సికమ్లోని యాంటీఇన్ఫ్లమేటరీ పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి. దీంట్లోని కెరొటినాయిడ్ లైకోపిన్ గర్భ, మూత్రాశయ, క్లోమ క్యాన్సర్ల ముప్పును నియంత్రిస్తుంది.
ఎముకలు దృఢంగా:దీంట్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ బారి నుంచి శరీరాన్ని కాపాడతాయి. క్యాప్సికమ్ క్యాటరాక్ట్, ఆస్టియో ఆర్థరైటిస్ బారినపడకుండానూ శరీరాన్ని రక్షిస్తుంది.