తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

అమ్మాయిలూ పొడి చర్మం ఉందా.. ఇలా ప్రయత్నించండి

పొడిచర్మంతో ఇబ్బందిపడేవారు దానిని తేమగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. లేదంటే చర్మం నిర్జీవంగా మారుతుంది. దురదగానూ అనిపిస్తుంది. చర్మాన్ని తేమతో నిగారించేలా చేసే పూతలివి...

dry skin tips
dry skin tips

By

Published : Jul 5, 2020, 10:26 AM IST

అరటిపండుతో: రెండు చెంచాల అరటిపండు గుజ్జు తీసుకుని దానిలో ఆలివ్‌ నూనె అయిదారు చుక్కలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మానికి తగినంత పోషణ లభిస్తుంది. చూడ్డానికీ ఆరోగ్యంగా అందంగా కనిపిస్తుంది.

తేనెతో: చర్మం మరీ పొడిబారినట్లుగా, నిర్జీవంగా కనిపిస్తుంటే ఈ పూతను ప్రయత్నించండి. సగం అరటిపండు పేస్ట్‌లో రెండు చెంచాల తేనె వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి పట్టించాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో కడిగేయాలి.

బొప్పాయి పూత:బొప్పాయిలో ఉండే విటమిన్‌-ఎ, విటమిన్‌-బి, ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. అలాంటి బొప్పాయి అందానికి మెరుగులు దిద్దడానికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. రెండు టేబుల్‌ స్పూన్ల బొప్పాయి గుజ్జులో టీస్పూన్‌ తేనె కలిపి ముఖానికి మెడకు పట్టించాలి. బాగా ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details