తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

సూపర్​విమెన్ ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

రెండు చేతులతో ఒకేసారి నాలుగైదు పనిచేయగల సత్తా మహిళది. ఉదయం లేచినప్పటి నుంచి క్షణం తీరికలేకుండా శ్రమించే మహిళామణులు.. ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది. మరీ సూపర్​విమెన్​ ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

food for women, women food, super women food
మహిళల ఆహారం, సూపర్​విమెన్ ఫుడ్

By

Published : Apr 22, 2021, 12:02 PM IST

మహిళలు ఆరోగ్యంగా, మరింత శక్తిమంతంగా మారాలంటే ఆహారం కూడా చాలా బలవర్థకంగా ఉండాలి. అందుకు ఏం తీసుకోవాలంటే...

మీగడ లేని పెరుగు... దీంట్లో శరీరానికి మేలు చేసే ప్రోబ్యాక్టీరియాతో పాటు క్యాల్షియం మెండుగా ఉంటుంది. ఎక్కువ పనులు చేసే మహిళలకు ఎముక సామర్థ్యం బాగుండాలి కదా! అందుకే రోజూ పెరుగు తీసుకోవాలి.

చేపలు... వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని ప్రతి అణువుకూ ఆరోగ్యాన్నిస్తాయి. అలాగే ప్రొటీన్‌ కూడా మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే గుండెజబ్బులు, హైపర్‌ టెన్షన్‌, ఒత్తిడి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ ఫ్యాటీ ఆమ్లాలుండే వాల్‌నట్స్‌, అవిసె గింజలనూ తీసుకుంటే మరింత మంచిది.

టొమాటోలు... వీటిలో లైకోపిన్‌ అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. దాంతోపాటు విటమిన్‌-సి కూడా. టొమాటోను తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ వంటి వ్యాధులను కొంతవరకు నిరోధించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.

ఆకుకూరలు... ముదురు ఆకుపచ్చ రంగుల్లోని ఆకుకూరల్లో విటమిన్‌-ఎ, సి సమృద్ధిగా ఉంటాయి. అలాగే క్యాల్షియం కూడా. ఇవి కంటికి, ఎముకల బలానికి, జీర్ణక్రియకు సాయపడతాయి.

ఎండు ఫలాలు... రోజూ గుప్పెడు డ్రైఫ్రూట్స్‌ తింటే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఇవి ఆకలిని నియంత్రించడమే కాకుండా తీపి తినాలనే ఆలోచననూ తగ్గిస్తాయి. వీటిలోని ‘ఫైటో ఈస్రోజెన్స్‌’ హార్మోన్ల సమతౌల్యానికి ఉపకరిస్తాయి. స్త్రీలలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. ఎండిన ఖర్జూర, ఆప్రికాట్స్‌, నేరెడు పళ్లలో ఫైటో ఈస్ట్రోజెన్‌ అధికం. కాబట్టి వీటిని తప్పక తీసుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details