దాల్చినచెక్క పొడి, బేకింగ్‌సోడా, యాపిల్‌సిడార్ వెనిగర్.. ఈ మూడింటిని కలపకుండా.. వీటిని వేర్వేరు పదార్థాలతో కలిపి వాడితే మంచిదే. వీటిని తేనె, కొబ్బరినూనె, పాలు, ఆలివ్‌ఆయిల్.. ఇలాంటి వాటితో కలిపి వాడాలి. ఈ మూడింటినీ కలిపి రాస్తే చర్మం కందిపోతుంది. దాల్చినచెక్క పొడి మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. యాపిల్‌సిడార్ వెనిగర్ చర్మం పీహెచ్ స్థాయులను సమతుల్యం చేసి సీబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అంతేకాదు చర్మ రంధ్రాల్లోని మలినాలనూ తొలగించి వాటిని బిగుతుగా చేస్తుంది.
దాల్చినచెక్కతో ఫేస్‌ప్యాక్ వేసుకోవచ్చా? - Baking soda face pack
దాల్చిన చెక్క పొడి, బేకింగ్ సోడా, యాపిల్‌సిడార్ వెనిగర్లు వంటకు రుచిని తేవడమే కాదు.. చర్మానికి నిగారింపూ తెస్తాయంటున్నారు ప్రముఖ కాస్మటాలజిస్ట్ డాక్టర్. శైలజ. ఈ మూడింటిని కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే మాత్రం చర్మం కందిపోతుందని హెచ్చరిస్తున్నారు. మరి నిగనిగలాడే చర్మం కోసం వీటిని ఎలా వాడాలో తెలుసుకుందామా!
బేకింగ్‌సోడా మొటిమలను తగ్గిస్తుంది. దీంట్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమల నియంత్రణకు తోడ్పడతాయి. ఇది చర్మం మీద మృత కణాలనూ తొలగిస్తుంది. అయితే ఈ మూడింటినీ పలచగా చేసి మాత్రమే వాడాలి. స్వచ్ఛమైన పసుపు, దాల్చినచెక్కపొడి, తేనె కలిపి వాడినా ఫలితం ఉంటుంది. తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. పసుపులో కొబ్బరినూనె కలిపి రాయడం వల్ల కూడా మొటిమలు తగ్గుతాయి. తేనె, దాల్చినచెక్క పొడి కలిపి రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఆలివ్‌ఆయిల్, తేనె సమాన పరిమాణంలో తీసుకుని రాసినా ఫలితం ఉంటుంది.
ఆపిల్‌సిడార్ వెనిగర్‌లో రెట్టింపు తేనె కలిపి రాయడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. బేకింగ్‌సోడాలో రెట్టింపు తేనెను కలపి రాయడం వల్ల మృతకణాలు తొలగడంతోపాటు ముఖ చర్మం చక్కగా మెరుస్తుంది కూడా.