తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

చినుకు కాలంలో... చిన్నారి ఆరోగ్యం భద్రమిలా!

వానాకాలంలో వచ్చే వాతావరణ మార్పులు అందరిపైనా ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఈ కాలంలో చిన్నారుల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహించాలి. అందుకోసం ఈ చిట్కాలు పాటించండి.

your child can be protected using these tips in rainy reason
చినుకు కాలంలో... చిన్నారి ఆరోగ్యం భద్రమిలా!

By

Published : Aug 4, 2020, 10:28 AM IST

  • ఉదయం వేడిగా, సాయంత్రం, రాత్రిళ్లు చల్లగా ఇలా వాతావరణంలో రకరకాలుగా మార్పులు వస్తుంటాయి. చిన్నారికి దుస్తులను అందుకు తగ్గట్టుగా వెయ్యాలి. వేడిగా ఉన్నప్పుడు తేలికగా ఉండే శుభ్ర మైన, మృదువైన కాటన్ దుస్తులను వేయాలి. వర్షం పడుతున్నప్పుడు, వాతావరణం చల్లగా ఉన్న ప్పుడు వెచ్చటి ఉన్ని దుస్తులను తొడిగితే సరి.
  • చిన్నారి వ్యక్తిగత పరిశుభ్రత విష యంలో అశ్రద్ధ చేయొద్దు. వాతావ రణం తేమగా ఉండటం వల్ల పిల్లల్లో చెమట పోస్తుంది. ఆ చెమటని అలానే వదిలేస్తే పిల్లలకి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవ కాశం ఉంది. అందుకే ఉదయం స్నానం తో పాటు సాయంత్రం గురువు చ్చటి నీటిలో ముంచిన వస్త్రంతో శరీ రాన్ని పూర్తిగా తుడవాలి.
  • ఈ కాలంలో నీళ్లు తరచూ కలుషితమవుతుంటాయి. వీటిని తాగడం వల్ల డయేరియా, టైఫాయిడ్, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి బాగా మరిగించిన తర్వాతే చిన్నారికి పట్టించాలి పచ్చివి, శుభ్రం చేయని ఆహార పదార్థాలను దూరంగా పెట్టాలి.
  • వానాకాలం మొదలయ్యే నాటికే మీ చిన్నారికి పూ, టైఫాయిడ్, ఇతర వ్యాక్సిన్లను ఇప్పించాలి. దాంతో ఆ వ్యాధుల బారిన పడకుండా కాపాడగలుగుతాం
  • ఈ సమయంలో మీ బిడ్డకు జలుబు, ఫ్లూ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఫలితంగా జ్వరం కూడా రావొచ్చు. కాబట్టి వైద్యుల సలహా మేరకు కొన్ని రకాల మందులను ఎల్లప్పుడూ అందుబాటులో పెట్టుకోవాలి దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పాపాయికి పాల సీసా, ఇతర వస్తువులను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసి పొడిగా పెట్టాలి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details