తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Green Tea Benefits: గ్రీన్‌ టీతో కరోనా వైరస్‌కు చెక్‌!

Green Tea Benefits: గ్రీన్​ టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది మెదడుకు హానికర పదార్థాలు చేరకుండా అడ్డుకునే వ్యవస్థను సైతం దాటుకొని వెళ్లి ఆందోళన తగ్గటానికి తోడ్పడుతుంది. ఇది తాగితే బరువు తగ్గుతారు అని చాలా పరిశోధనల్లో తేలింది. తాజా అధ్యాయనాల్లో తేలిందేమిటంటే.. గ్రీన్​టీలో కరోనా వైరస్​ను అడ్డుకునే శక్తి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

Green Tea Benefits
Green Tea Benefits

By

Published : Feb 3, 2022, 8:01 AM IST

Green Tea Benefits: గ్రీన్‌ టీలో ఆరోగ్యాన్ని కాపాడే యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయని, ఈ టీ సేవనం క్యాన్సర్లకు చెక్‌ పెడుతుందనేది ఇప్పటికే తెలిసిన విషయం. కరోనా వైరస్‌నూ అడ్డుకునే శక్తి ఇందులో ఉందని తాజా అధ్యయనం తేల్చింది. కరోనా వైరస్‌పై గ్రీన్‌ టీ ప్రభావంపై ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌)లోని వివిధ విభాగాలు, ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)కి చెందిన శాస్త్రవేత్తలు కరోనా తొలి, రెండు దశల్లో దాదాపు 6 నెలలపాటు ల్యాబ్‌లో పరిశీలించారు. సైంటిస్టులు రామకృష్ణ ఉంగరాల, మన్నె మునికుమార్‌, సురేష్‌ నారాయణ సిన్హా, ఆర్‌.శ్యాంసుందర్‌, సురేష్‌ చల్లా, డిలేశ్వర్‌కుమార్‌ ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.

సాధారణంగా గ్రీన్‌ టీలో ఎపిగాల్లో కాటెచిన్‌-3-గాలేట్‌ (ఈజీసీజీ) అనే పదార్థం ఉంటుంది. ఇది బయట గాలితో కలిసినప్పుడు ఆక్సీకరణం చెంది వివిధ మ్యాలిక్యూల్స్‌గా విడిపోతుంది. మానవ కణాలపై వీటిని ప్రయోగించినప్పుడు కొవిడ్‌ నియంత్రణకు ఇవి తోడ్పాటు అందించాయి. కొవిడ్‌ బాధితుల్లో ఇన్‌ఫ్లమేషన్‌ (వాపు) అతిపెద్ద సమస్య. కరోనా రెండో దశలో పలువురిలో.. శరీరంలోని వివిధ భాగాల్లో ఇన్‌ఫ్లమేషన్‌ పెరిగి ప్రాణాల మీదకు వచ్చింది. గ్రీన్‌ టీలో ఉండే ఈజీసీజీ ఇతర మూలకాలు ఇన్‌ఫ్లమేటరీ మార్కర్లను తగ్గించడంలో కీలకంగా మారుతున్నట్లు తేలింది. అంతేకాక ఊపిరితిత్తుల్లోని స్పైక్‌ ప్రొటీన్లనూ ఈజీసీజీ, ఇతర మాలిక్యూల్స్‌ అడ్డుకుంటున్నట్లు ప్రాథమిక అధ్యయనంలో తేలినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ముఖ్యంగా ఐఎల్‌-6, ఐఎల్‌-1బీటా, టీఎన్‌ఎఫ్‌-గామా తదితర ఇన్‌ఫ్లమేటరీ మార్కర్‌లనూ సమర్థంగా నిరోధిస్తున్నట్లు తేలిందన్నారు. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారు నిత్యం 3-4 కప్పులు గ్రీన్‌టీ తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details