తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మానసిక వైద్యుల సూచనల కోసం.. సీ-19 టాస్క్‌ఫోర్స్‌

గత ఏడాది మార్చిలో మొదటి దశలోనే కరోనా వైరస్ సోకింది. అయినా అధైర్యపడకుండా హైదరాబాద్ గాంధీలో చికిత్స తీసుకుని కరోనాను జయించాడు. ఆ తరువాత ప్లాస్మాదానంలో కూడా నేనున్నానంటూ ముందుకొచ్చాడు. తనకు తెలిసినవారితో గ్రూప్ ఏర్పాటు చేసి... ప్లాస్మా దానం చేయించాడు. ఇలా కరోనా బాధితులకు సాయపడుతున్న ఓరుగల్లు యువకుడు... అఖిల్ యన్నంశెట్టి.... సీ19 టాస్క్​ఫోర్స్ తో... 24/7 కొవిడ్ బాదితులకు సలహాలు సూచనలందిస్తూ....వారికి అండగా నిలుస్తున్నాడు.

c-19-task-force-charity-helps-in-covid-time
మానసిక వైద్యుల సూచనల కోసం.. సీ-19 టాస్క్‌ఫోర్స్‌

By

Published : May 14, 2021, 10:29 AM IST

ఇంట్లో, ఇరుగుపొరుగో, తెలిసిన వాళ్లకో కరోనా సోకిందన్న సమాచారం. ఆసుపత్రుల్లో అందుబాటులో లేని పడకలు, ఆక్సిజన్‌ అందక ప్రాణాలు విడుస్తున్న బాధితులు.... ఇలా ఎన్నో ఆందోళన కలిగించే వార్తలు. పైగా ఎప్పుడు వైరస్‌ బారినపడతామో అనే భయంతో చాలా మందిలో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వాళ్లకు ధైర్యం కలిగిస్తోంది... సీ-19 టాస్క్‌ఫోర్స్‌. వైద్యులు, మానసిక నిపుణులు, వివిధ రంగాల నిపుణులతో కూడిన ఈ సేవా సంస్థ... ఔషధాల వినియోగం, కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చిన తర్వాత అనుసరించాల్సిన విధానాలపై ప్రజలకు... కాల్‌ సెంటర్‌ ద్వారా ఉచితంగా సలహాలు, సూచనలు అందిస్తోంది. తమ సలహా ఓ ప్రాణాన్ని నిలబెట్టినా... తమ కష్టాన్ని ఫలితం దక్కినట్టే అంటున్న సీ-19 టాస్క్‌ఫోర్స్‌ వ్యవస్థాపకుడు... యన్నంశెట్టి అఖిల్‌తో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి.

మానసిక వైద్యుల సూచనల కోసం.. సీ-19 టాస్క్‌ఫోర్స్‌

ABOUT THE AUTHOR

...view details