తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Avocado uses: రక్త క్యాన్సర్‌కు.. అవకాడో కళ్లెం

20 రకాల విటామిన్లు కల్గిన అవకాడో పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిని తినడం వల్ల శరీరంలోని చెడు కొవ్వు అంతా కరిగిపోయి... మంచి కొవ్వు వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా తీవ్ర రక్తక్యాన్సర్‌ కణాలను అడ్డుకునే గుణం... ఈ పండులో అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

avocado-reduces-blood-cancer
రక్త క్యాన్సర్‌కు.. అవకాడో కళ్లెం

By

Published : Jul 27, 2021, 2:33 PM IST

ముదురు ఆకుపచ్చ, ఒకింత నలుపు రంగులో కనిపించే అవకాడో పండులో పోషకాలు దండిగా ఉంటాయి. దీంతో 20 రకాల విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. అంతేనా? ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు ఆమ్లాల (మోనోఅన్‌సాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆసిడ్స్‌- ఎంయూఎఫ్‌ఏ) శాతమూ ఎక్కువే. ఇవే ఇప్పుడు పరిశోధకులను ఆకర్షిస్తున్నాయి. అవకాడోలో అవకాటిన్‌ బి అనే కొవ్వు అణువులుంటాయి. దీనికి అక్యూట్‌ మైలాయిడ్‌ ల్యుకీమియా (ఏఎంఎల్‌) అనే తీవ్ర రక్తక్యాన్సర్‌ కణాలను అడ్డుకునే గుణం ఉండటం విశేషం. అవకాటిన్‌ బి మధుమేహ నివారణ, ఊబకాయ నియంత్రణకు తోడ్పడుతున్నట్టు ఇప్పటికే బయటపడింది. ఇది వీఎల్‌సీడీ ఎంజైమ్‌నూ సమర్థంగా ప్రతిఘటిస్తున్నట్టు తాజాగా గుర్తించారు.

రక్తక్యాన్సర్‌ కణాలు వృద్ధి చెందటంలో, విస్తరించటంలో వీఎల్‌సీఏడీ కీలక పాత్ర పోషిస్తుంది. క్యాన్సర్‌ కణాలు తమ మనుగడ కోసం దీని మీదే ఆధారపడుతుంటాయి. అందుకే దీన్ని రక్తక్యాన్సర్‌ బాధితులపై ప్రత్యక్షంగా పరీక్షించటంపై పరిశోధకులు దృష్టి సారించారు. అక్యూట్‌ మైలాయిడ్‌ ల్యుకీమియా తీవ్రమైన సమస్య. ప్రస్తుతం పెద్దగా చికిత్సలేవీ అందుబాటులో లేవు. దీని బారిన పడ్డవారిలో 10% మందే ఐదేళ్ల కన్నా ఎక్కువ కాలం జీవించ గలుగుతున్నారు. కేవలం సగం మందికే కీమోథెరపీ ఇస్తున్నారు. మిగతావారికి నొప్పులు తగ్గించటం వంటి ఉపశమన చికిత్సలు మాత్రమే చేస్తున్నారు. కీమోథెరపీ తీసుకునేవారిలో చాలామంది చికిత్స మూలంగానే మరణిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో అవకాడోలోని అవకాటిన్‌ బి ప్రయోజనాలు కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి.

అవకాడోను ఇలా తినండి...

అధిక కొవ్వు కారణంగా... దీని గుజ్జును చికెన్, చేపలు, మటన్ కూరలతో పాటు శాండ్​విచ్, సలాడ్లలో విరివిగా ఉపయోగిస్తారు. అవకాడో పండు గుజ్జును పంచదార పాలలో లేదా పంచదారతో కూడిన నీటిలో కలిపి జూస్​గా తీసుకోవచ్చు. దీనిలో ఉండే గుజ్జు శరీరంలోని చెడు కొవ్వును తగ్గించి మంచి కొవ్వును పెంచుతుంది. అవకాడోలు ఫోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉండే అవకాడో విత్తనంతో అనేక ప్రయోజనాలున్నాయి. అందువల్లే, దీన్ని డార్క్ చాక్లెట్, కుకీల తయారీలో కూడా ఉపయోగిస్తారు. కేవలం 28 గ్రాముల అవకాడో పండ్లలో ఒక జౌన్స్ ఆరోగ్యకరమైన ఫైబర్స్, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. అందువల్ల, మీ భోజనానికి పోషకమైన బూస్ట్ ఇవ్వడానికి, మీ వంటకాల రుచిని పెంచడానికి మీ రోజూవారి డైట్​లో వీటిని జోడించవచ్చు.

ఇదీ చూడండి:అరటి పండుతో ఎన్నో ప్రత్యేకతలు.. అవేంటో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details