తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఇంట్లోనే తయారు చేసుకోండిలా!

ఏ కాలంలోనైనా చర్మం తాజాగా ఉండాలంటే దానికి తగిన పోషణ కావాల్సిందే. అందుకోసం మాయిశ్చరైజర్‌ చక్కగా ఉపయోగపడుతుంది. మరిదాన్ని సహజసిద్ధంగా ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందామా...

Tips for fresh skin in telugu
ఇంట్లోనే తయారు చేసుకోండిలా!

By

Published : Jan 28, 2021, 1:45 PM IST

మొదట ఓ గిన్నెలో పెద్ద చెంచా చొప్పున కొబ్బరినూనె, బాదంనూనె, గ్లిజరిన్‌లను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి మూడు చెంచాల కలబంద గుజ్జు జత చేయాలి. ఇప్పడు మరొకసారి బాగా కలిపి గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకోవాలి. దీన్ని దాదాపు పదిహేను రోజులపాటు వాడుకోవచ్చు.

ఎలా వాడాలంటే...

స్నానానికి ముందు ఈ లోషన్‌ను శరీరానికి పట్టించి కాసేపు మర్దనా చేయాలి. ఇలా చేస్తే లోషన్‌ను చర్మం పీల్చుకుంటుంది.

లాభాలు... బాదం నూనె....

యాంటీ ఏజింగ్‌ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇది వయసు పెరుగుతుండటం వల్ల వచ్చే చర్మ సమస్యలను నియంత్రిస్తుంది. కొబ్బరినూనె చర్మానికి పోషణనిస్తుంది. అలాగే కలబంద దాన్ని మృదువుగా మారుస్తుంది. ముఖంపై మొటిమలు, ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details