రైస్ వాటర్‌ను ఎలా తయారు చేయాలి..?
నానబెట్టడం
- ఒక అర కప్పు బియ్యాన్ని గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడగాలి.
- ఆ బియ్యాన్ని రెండు లేదా మూడు కప్పుల నీటిలో 30 నిముషాల పాటు నానబెట్టాలి.
- నానబెట్టిన నీటిని ఒక శుభ్రమైన గిన్నెలోకి వేరు చేయాలి
ఉడికించడం
- ఒక అరకప్పు బియ్యాన్ని గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడగాలి
- అందులో సాధారణంగా బియ్యం ఉడకడానికి పోసే నీళ్ల కంటే రెండింతలు ఎక్కువ నీటిని పోసి ఉడికించాలి.
- బియ్యం ఉడుకుతుండగా మిగిలిన నీటిని ఓ శుభ్రమైన గిన్నెలోకి తీసుకోవాలి.
చర్మానికి మేలు చేస్తుంది..!
రైస్ వాటర్‌లో అధికశాతంలో విటమిన్లు, మినరల్స్, అమైనో యాసిడ్స్ ఉంటాయి. చర్మాన్ని శుభ్రం చేసుకునే క్రమంలో ఈ నీటిని వాడటం ద్వారా మన చర్మం మృదువుగా మారుతుంది. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఫేషియల్ టోనర్‌గా..
రైస్ వాటర్‌ను ఫేషియల్ టోనర్‌గా కూడా వాడొచ్చు. ఒక కాటన్ ప్యాడ్‌పై ఈ నీటిని పోసి.. దానితో ముఖంపై మృదువుగా రాయాలి. అలా కొన్ని నిముషాలు ఉంచాక చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా వారంలో కనీసం రెండుసార్లు చేస్తే చర్మం మృదువుగా అవుతుంది. చర్మంపై ముడతలు తగ్గుతాయి.
సన్‌బర్న్ నుంచి ఉపశమనం..!
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల సున్నితమైన ప్రదేశాల్లో చర్మం కందిపోతుంటుంది. ఇలాంటి సమయాల్లో రైస్ వాటర్‌ను ఉపయోగించవచ్చు. ఓ కాటన్ ప్యాడ్‌పై ఈ నీటిని కొద్దిగా వేసి కందిపోయిన ప్రదేశాల్లో మృదువుగా రుద్దండి. దీనివల్ల మంట తగ్గుతంది.
ఆరోగ్యవంతమైన జుట్టుకోసం..!
జుట్టును రైస్ వాటర్‌తో కడగటం వల్ల జుట్టుకు కావాల్సిన పోషకాలు అంది బలంగా పెరుగుతుంది. ఇందుకోసం షాంపూతో తలస్నానం చేశాక రైస్ వాటర్‌ను తలపై పోసి.. ఆ నీరు కుదుళ్లకు చేరేలా మసాజ్ చేయండి. అలా కొన్ని నిముషాలు చేశాక శుభ్రమైన నీటితో జుట్టును కడిగేయండి. ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల ఫలితం తప్పక కనిపిస్తుంది.
రైస్ వాటర్‌తో ప్రయోజనాలెన్నో.!
మనం రోజూ ఎదుర్కొనే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు మన వంటింట్లోనే లభిస్తుంటాయి. పైగా వీటివల్ల మన శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో బియ్యం గడిగిన నీటిలో ఎన్నో పోషకాలుంటాయని.. అప్పట్లో మేము గంజి తాగడం వల్లనే ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నామని పెద్దవాళ్లు చెబుతుండటం వినే ఉంటాం. వాళ్ల మాటల్లో వాస్తవం లేకపోలేదు. బియ్యం నానబెట్టిన నీరు లేదా బియ్యం ఉడికించిన నీటి(రైస్ వాటర్) ద్వారా మన శరీరానికి చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..!
ఎలా తయారు చేయాలి..?
నానబెట్టడం
ఒక అర కప్పు బియ్యాన్ని గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడగాలి.
ఆ బియ్యాన్ని రెండు లేదా మూడు కప్పుల నీటిలో 30 నిముషాల పాటు నానబెట్టాలి.
నానబెట్టిన నీటిని ఒక శుభ్రమైన గిన్నెలోకి వేరు చేయాలి