ఏపీలోని తిరుపతి నగరంలో మహిళలు సరికొత్త రీతిలో దొంగతనాలు చేస్తున్నారు. దానం చేయాలంటూ దుకాణాల్లోకి వెళ్లి చోరీలు చేస్తున్నారు. చిన్నపిల్లలతోనూ దొంగతనం చేయిస్తున్నారు.
దానం చేయండి.. అంటూ వస్తారు.. అందినవి దోచేస్తారు.. - తిరుపతి క్రైమ్ వార్తలు
తిరుపతి నగరంలో సరికొత్త దొంగతనాలు వెలుగుచూస్తున్నాయి. కొందరు మహిళలు దానం చేయాలంటూ గుంపులుగా దుకాణాల్లోకి వచ్చి అందినవి దోచేస్తున్నారు. మహిళలు దుకాణాల్లోకి వెళ్లి చోరీలు చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
దానం చేయండి.. అంటూ వస్తారు.. అందినవి దోచేస్తారు..
తిరుపతి లీలామహల్ కూడలిలోని లక్ష్మీ వెంకటేశ్వర స్టీల్ దుకాణంలో ఇలా దొంగతనం చేశారు. అక్కడి సీసీ కెమెరాలో మహిళల చోరీ దృశ్యాలు నమోదయ్యాయి.
ఇవీ చదవండి:కాప్రా చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం