నిర్మల్ జిల్లాకేంద్రంలోని నాయిడివాడకు చెందిన వివాహిత పి.మంజుల అనుమానాస్పద స్థతిలో మృతిచెందింది. విద్యుదాఘాతంతో చనిపోయిందని అత్తింటివారు మంజుల కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కరెంట్ షాక్‌తో చనిపోలేదని..అత్తింటివారే హత్య చేశారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యుత్‌షాక్‌తో ఉదయం చనిపోతే ఇప్పటి వరకు మృతదేహం రంగు మారి ఉండేదని అనుమానం వ్యక్తం చేశారు. గతంలోనూ అదనపు కట్నం కోసం తమ కూతురిను వేధించారని, ఎన్నోసార్లు పంచాయతీలు జరిగాయని వివరించారు. పోలీసులు సరైన విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు.
వివాహిత అనుమానాస్పద మృతి, అత్తింటివారే చంపారని ఆరోపణ - women death
నిర్మల్ జిల్లా కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. అత్తింటివారే హత్య చేశారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
వివాహిత అనుమానాస్పద మృతి, అత్తింటివారే చంపారని ఆరోపణ