తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వైద్యానికి డబ్బులేదని భర్త ఒడిలో కనుమూసిన భార్య - women-suicide-for-no-money-to-health-checkup-in-ap

ఆరోగ్యం క్షీణించింది. ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరిగింది. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. చేతిలో డబ్బులు లేవు. ఏమీ చేసేది లేక ఆ మహిళ స్వగ్రామానికి తిరిగి వెళ్తూ... పురుగుల మందు తాగింది. భర్త ఒడిలోనే ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది.

భార్య ఆత్మహత్య... కాపాడుకునేందుకు భర్త యాతన..

By

Published : Sep 10, 2019, 12:57 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆరోగ్యం క్షీణించిన ఆమె ప్రైవేటు వైద్యం చేయించుకోలేని దుస్థితిలో ఈ ఘటనకు ఒడిగట్టింది.

అసలేమైందంటే...

కర్ణాటకలోని బేరుకురుకు చెందిన శోభ, అమరేశ్​ దంపతులు. కుప్పం వద్ద కోళ్ళ ఫారంలో కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం శోభ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించందని భర్త తెలిపారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా ...మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాలని వైద్యులు సూచించారు. డబ్బులు లేక స్వగ్రామానికి వెళ్తుండగా .. కుప్పం బస్టాండు వద్ద... భర్త ఒడిలోనే ఆమె ప్రాణాలు విడిచింది.

భర్త ఒడిలోనే తనువు చాలించిన భార్య

ఇదీ చూడండి- భారత్​-పాక్​లు కోరితే మధ్యవర్తిత్వం చేస్తా: ట్రంప్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details