తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మద్యానికి బానిసై.. భార్య ఆత్మహత్య - police

సికింద్రాబాద్​ బోయిన్​పల్లిలో మద్యానికి బానిసైన భార్యను భర్త మందలించటంతో ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది.

మద్యానికి బానిసై మహిళ ఆత్మహత్య

By

Published : Feb 3, 2019, 1:14 PM IST

మద్యానికి బానిసై మహిళ ఆత్మహత్య
మద్యం సేవించవద్దని భార్యను భర్త మందలించటంతో ఆ మహిళ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సికింద్రాబాద్ బోయిన్​పల్లిలో చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ కడక్​పూర్ ప్రాంతానికి చెందిన నాగవెల్లి లక్ష్మి, బోయిన్​పల్లికి చెందిన రాము ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొద్ది నెలలుగా లక్ష్మి మద్యానికి బానిసైంది.
కుమారుడితో తెప్పించుకొని నిత్యం మద్యం సేవించేది. విసుగుచెందిన రాము గట్టిగా మందలించాడు. మనస్తాపానికి గురైన లక్ష్మి ఇంటి గుమ్మానికి చీరతో ఉరివేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details