తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అమానుషం: అప్పు తీర్చలేదని చంపేశారు!

వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న అప్పు ఆమె ప్రాణం తీసింది. చేసిన అప్పు చెల్లించనందుకు నడిరోడ్డు మీద కిరాతకంగా హత్యకు గురైంది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా చక్రాయపాలెంలో చోటుచేసుకుంది.

AP crime latest news
AP crime latest news

By

Published : Jun 11, 2020, 5:38 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా కొల్లిపర మండలం చక్రాయపాలెంలో నడిరోడ్డు మీద ఓ మహిళ హత్యకు గురైంది. గ్రామానికి చెందిన చందు సామ్రాజ్యం వడ్డీ వ్యాపారి అయిన వీరయ్య దగ్గర దాదాపు రూ. 20లక్షలు అప్పుచేసింది. ఆ డబ్బును ఆమె బయట వడ్డీలకు తిప్పుతుండేది. అయితే తమ అప్పు తీర్చాల్సిందిగా వీరయ్య, అతని భార్య నర్సమ్మ.. సామ్రాజ్యాన్ని అడిగేవారు. డబ్బుకు బదులుగా పొలాన్ని వారి దగ్గర తాకట్టు పెట్టారు.

గురువారం మళ్లీ సొమ్ము విషయంలో గొడవ తలెత్తింది. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన వీరయ్య, అతని భార్య.. సామ్రాజ్యం కళ్లల్లో కారం కొట్టి, గడ్డపారతో దాడిచేశారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై చంపేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సామ్రాజ్యం భర్తపైనా దాడిచేయగా.. గాయాలయ్యాయి. అతనిని తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వడ్డీవ్యాపారులు డబ్బుకు బదులుగా పొలం, ఇల్లు బలవంతంగా రాయించుకుని... అన్యాయంగా తమ బిడ్డను చంపేశారని సామ్రాజ్యం తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details