ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ఒక మహిళ మృతి చెందిన ఘటన హైదరాబాద్ తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని అడ్డగుట్టలో చోటు చేసుకుంది. అడ్డగుట్టకు చెందిన ఆండాలు (45)... ఉదయం ఇంటి ఆవరణలోని సంపులో నుంచి నీళ్లు పట్టటం కోసం పైపు అమర్చే సమయంలో కాలు జారి పడిపోయింది.
మంచి నీళ్లు పట్టుకోబోయి సంపులో పడి మహిళ మృతి - dead news
హైదరాబాద్ అడ్డగుట్టలో విషాదం చోటుచేసుకుంది. నీళ్లు పట్టుకునేందుకు పైపు అమర్చే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి ఓ మహిళ సంపులో పడింది. ఇంట్లో ఎవరూ లేకపోవటం వల్ల ఆ బాధితురాలు నిస్సహాయ స్థితిలో సంపులోనే మరణించింది.
women died due to dropped in water tank in addagutta
ప్రమాద సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవటం వల్ల ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు. దాదాపు గంట తరువాత చూసిన కుటుంబసభ్యులు.... ఇరుగుపొరుగు వారి సాయంతో దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. ఆమె అప్పటికే మరణించిందని నిర్ధరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.