తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అత్తింటి ముందు కోడలు ఆందోళన.. మామపై ఆరోపణ - nizamabad city news

అత్తింటి ముందు కోడలు పిల్లలతో సహా ఆందోళన చేపట్టిన ఘటన నిజామాబాద్​లో జరిగింది. తమను ఇంట్లో ఉండనివ్వకుండా మామ వేధిస్తున్నారని ఆరోపించింది.

wife protest with her childrence in front of husband in nizamabad
అత్తింటి ముందు కోడలు ఆందోళన.. మామ వేధిస్తున్నాడని ఆరోపణ

By

Published : Aug 27, 2020, 3:33 PM IST

నిజామాబాద్​లోని ఎల్లమ్మగుట్టకు చెందిన నవీన్​కు ఆర్మూర్ మండలం పెర్కిట్​కు చెందిన నవనీతతో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగిన సంవత్సరానికి భర్త చనిపోయాడని, అప్పటి నుంచి మామ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఆరోపించారు.

కొడుకు లేనప్పుడు నువ్వు ఎందుకు అంటూ వేధిస్తున్నారని చెప్పారు. ఇంట్లో ఉంటానని వచ్చిన తనను వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రావటంతో మామ ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయారని నవనీత చెప్పారు. న్యాయం చేయాలంటూ కూతురుతో కలిసి గేటు ముందు బైఠాయించింది.

ఇదీ చూడండి:టిక్​టాక్​ సీఈఓ పదవికి కెవిన్​ రాజీనామా.. కారణమిదే

ABOUT THE AUTHOR

...view details