సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి వాహనంపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను మధ్య మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. చాడ వాహనంపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు.. తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. తన స్నేహితుడిపై కోపంతో... స్నేహితుడి వాహనం అనుకొని దాడి చేశానని శుక్లా చెప్పారు. గత సంవత్సరం మతిస్థిమితం సరిగా లేక... తాను శంషాబాద్ ఆశాజ్యోతి ఆసుపత్రిలో 5 నెలలు చికిత్స తీసుకున్నానని శుక్లా తెలిపారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని... సీపీఐ పార్టీపై గానీ, ఆ పార్టీ నాయకులపై గానీ ఎలాంటి దురుద్ధేశాలు లేవని పోలీసులు విచారణలో శుక్లా వెల్లడించారు. విచారణ అనంతరం కోర్టులో హాజరుపరచనున్నట్లు నారాయణగూడ పోలీసులు తెలిపారు.
చాడ వాహనంపై దాడి చేసిన ఇద్దరు నిందితులు అరెస్ట్
సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి వాహనంపై దాడి చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. స్నేహితుడి వాహనం అనుకుని దాడి చేశానని ఓ నిందితుడు తెలిపాడు.
చాడ వాహనంపై దాడి చేసిన ఇద్దరు నిందితులు అరెస్ట్