ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని 67 వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామ సమీపంలో... లారీని ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ డీజిల్ ట్యాంక్ పేలి ద్విచక్ర వాహనానికి మంటలు అంటుకున్నాయి.
ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం - gutthi crime news
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఎంగిలిబండలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ద్విచక్రవాహనం ఢీ కొట్టిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు.
ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం
ఈ ప్రమాదంలో లారీ దగ్ధం కాగా... ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మృతులు యాడికి మండలం భోగాలకట్ట గ్రామానికి చెందిన నారాయణరెడ్డి, రోషి రెడ్డిగా గుర్తించారు.
ఇదీ చదవండి :ఆ అనుమానంతోనే తల్లిని కడతేర్చాడా..?