తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బ్యాంకు నుంచి తీసిన కొంతసేపటికే నగదు చోరీ

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరులో పట్టపగలే బ్యాంకు వద్ద చోరీ జరిగింది. బ్యాంకులో నగదు డ్రా చేసి బయటకొచ్చిన కొద్దిసేపటికే రూ. రెండు లక్షలను కాజేశారు కిలాడీలు. తెలిసిన వారితో బాధితుడు మాట్లాడి వచ్చిన సమయంలోనే నగదు దోచేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

బ్యాంకు నుంచి తీసిన కొంతసేపటికే నగదు చోరీ
బ్యాంకు నుంచి తీసిన కొంతసేపటికే నగదు చోరీ

By

Published : Oct 23, 2020, 7:21 AM IST

బ్యాంకులో నగదు డ్రా చేసి బయటకొచ్చిన కొద్దిసేపటికే రూ. రెండు లక్షలను కాజేశారు కిలాడీలు. ఏపీ గుంటూరులోని చంద్రమౌళినగర్​కు చెందిన వంశీకృష్ణ తన డబ్బు పోయిందంటూ గురువారం పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించారు.

స్థానిక కెనరా బ్యాంకు నుంచి గురువారం మధ్యాహ్నం వంశీకృష్ణ 2 లక్షల రూపాయలు డ్రా చేశాడు. బయటకు వచ్చి నగదును ద్విచక్ర వాహన డిక్కీలో పెట్టాడు. ఇంతలో తెలిసిన వారు కనపడగా మాట్లాడాడు. తిరిగి వాహనం వద్దకు రాగా.. డిక్కీ తెరిచి ఉండటాన్ని గమనించాడు. అనుమానం వచ్చి చూడగా నగదు లేదని బాధితుడు తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా.. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details