రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంక్సాపూర్‌లో... విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్, అజయ్ కుమార్ అనే ఇద్దరు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు.. రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.
పుట్టిన రోజు వేడుక నుంచి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి - two died in vardhavelli road accident
ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టడం వల్ల ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం వర్దవెళ్లిలో చోటు చేసుకుంది. పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని తిరిగివస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
వర్దవెళ్లిలో రోడ్డు ప్రమాదం
బోయిన్‌పల్లి మండలం వర్దవెళ్లిలో.. పుట్టిన రోజు వేడుకల్లోని పాల్గొని... ద్విచక్రవాహనంపై గ్రామానికి వస్తుండగా... ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం... సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. ఆస్పత్రికి చేరుకొని బోరున విలపించారు.