ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తనకల్లు మండలం నల్లగుట్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అక్కాతమ్ముడు నీటికుంటలో పడి మృతిచెందారు. గ్రామానికి చెందిన రామచంద్ర, గాయత్రి దంపతులకు ముగ్గురు సంతానం. భార్యాభర్తలు, పెద్ద కుమార్తె పొలం వెళ్లగా.. రెండో కుమార్తె వేదిత, కుమారుడు సాయితేజ ఇంటి దగ్గర ఉన్నారు. గ్రామంలోని మరో బాలుడితో కలిసి వారిద్దరూ నీటికుంట వద్దకు ఆడుకునేందుకు వెళ్లారు.
విషాదం.. నీటికుంటలో పడి అక్కాతమ్ముడు మృతి
అమ్మానాన్నలు పొలానికి వెళ్లగానే పిల్లలిద్దరూ ఆడుకునేందుకని సమీపంలో ఉన్న నీటి కుంట దగ్గరకు వెళ్లారు. వాళ్లిద్దరూ ప్రమాదవశాత్తు కుంటలో పడి మరణించారు. అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉన్న పిల్లల మరణ వార్త విన్న తల్లిదండ్రులు పిల్లల కోసం గుండెలవిసేలా రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ఈ విషాద ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా నల్లగుట్లపల్లిలో జరిగింది.
విషాదం.. నీటికుంటలో పడి అక్కాతమ్ముడు మృతి
ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు సాయితేజ నీళ్లల్లో పడిపోయాడు. తమ్ముడ్ని కాపాడేందుకు ప్రయత్నించిన వేదిత కూడా నీటిలో మునిగిపోయింది. ఇది గమనించిన బాలుడు గ్రామస్థులకు విషయం చెప్పగా.. వారు వచ్చి ఇరువురినీ బయటకు తీశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా వేదిత మృతిచెందగా.. చికిత్స పొందుతూ సాయితేజ మరణించాడు. ఆడుతూ పాడుతూ తిరిగే తమ బిడ్డలు ఇక లేరని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇవీ చదవండి:కోదండరాం నిరసన దీక్ష.. ప్రజల బతుకులు కాపాడాలని డిమాండ్