హైదరాబాద్‌లో అర్ధరాత్రి రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. బంజారాహిల్స్‌లో బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు నంబర్-3లో... ఓ బెంజ్ కారు బంజారాహిల్స్ వైపు నుంచి వేగంగా వచ్చి.. ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆగి ఉన్న కారులో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. బెంజ్ కారులో ముగ్గురు యువకులు, ఓ యువతి ఉన్నారని... వీరంతా మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. కారు నడిపిన యువకుడిని అదుపులోకి తీసుకుని... క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్‌లో అర్ధరాత్రి రెండు వేర్వేరు ప్రమాదాలు - హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు
మద్యం మత్తు, మితిమీరిన వేగమే ప్రధాన కారణంగా అర్ధరాత్రి హైదరాబాద్‌లో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మద్యం సేవించిన ఘటనలో ముగ్గురు గాయపడగా.. మితిమీరిన వేగంతో వెళ్లి మరొకరు ప్రమాదానికి గురయ్యారు.
హైదరాబాద్‌లో అర్ధరాత్రి రెండు వేర్వేరు ప్రమాదాలు
మాదాపూర్‌లో మితిమీరిన వేగంతో వచ్చిన ద్విచక్రవాహనదారుడు రోడ్డు విభాగినిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్ నడిపే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించారు.