తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం బాలవరంలో వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అదుపు తప్పిన ట్రాక్టర్.. పంట పొలాల్లోకి దూసుకెళ్లడంతో భూదేవి, రాజేశ్ అనే ఇద్దరు చనిపోయారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.
పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బాలవరంలో ట్రాక్టర్ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పది మంది గాయపడ్డారు.
పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి
బిక్కవోలు మండలం ఆరికరేవుల, కాజులూరు మండలం ఆర్యావటంకు చెందిన 12 మంది.. మురారి అమ్మవారి ఆలయానికి ట్రాక్టర్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. ఆరికరేవుల వెళ్లి భూలక్ష్మి మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు.