తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తణుకులో విషాదం.. కాలువలో జారి పడి ముగ్గురు మృతి - west godavari latest updates

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు కాలువలో జారిపడి మృతి చెందారు. ఆడుకుంటుండగా ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు జారి రేవులో పడ్డారు. వారిని రక్షించబోయిన పిల్లల అమ్మమ్మ వారితో పాటు కాలువలో పడి కొట్టుకుపోయింది.

తణుకులో విషాదం.. కాలువలో జారి పడి ముగ్గురు మృతి
తణుకులో విషాదం.. కాలువలో జారి పడి ముగ్గురు మృతి

By

Published : Jul 21, 2020, 9:01 PM IST

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు కాలువలో జారిపడి మృతి చెందిన ఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగింది. వేల్పూరు రోడ్డులోని వి. మాక్స్ థియేటర్ ఎదురుగా గోస్తని కాలువ గట్టున వడ్లమూడి అభిషేక్​(7), తమ్ముడు జాన్ కలెవన్(5) కాలువలో దిగి ఆడుతుండగా పిల్లలిద్దరూ రేవులో జారిపడ్డారు. రక్షించబోయిన పిల్లల అమ్మమ్మ వారితో పాటు కాలువలో కొట్టుకుపోయింది.

అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురు రేవు దగ్గర్లో దొరకగా వారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ముగ్గురి మృతితో తణుకు పట్టణంలో విషాదం నెలకొంది.

ఇదీ చదవండి: నరసన్నపాలెం వద్ద పట్టుబడిన గంజాయి లారీ

ABOUT THE AUTHOR

...view details