యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మైలార్ గూడెంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మైలార్ గూడెం పరిధిలోని ఓ వెంచర్లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.
పేకాట స్థావరాలపై దాడి... ముగ్గురు అరెస్ట్ - యాదాద్రి భువనగిరి జిల్లా నేర వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మైలార్ గూడెంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారివద్ద నుంచి ఎనిమిది ద్విచక్రవాహనాలు, 8,600 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు.
పేకాట స్థావరాలపై దాడి...ముగ్గురు అరెస్ట్
వారి వద్ద నుంచి ఎనిమిది ద్విచక్ర వాహనాలు, 8,600 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాదగిరిగుట్ట ఎస్సై రాజు వెల్లడించారు.