తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఏపీ: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం.. - crime news in anantapur district

.

accident ananthapur
accident ananthapur

By

Published : Sep 15, 2020, 8:39 AM IST

ఏపీ: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం..

అనంతపురం జిల్లా తాడిపత్రి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుచానూరుకి చెందిన ఆధ్యాత్మిక గురువు మురళీస్వామి సోమవారం మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని చూసేందుకు తాడిపత్రి పట్టణానికి చెందిన 10 మంది క్రూజర్ వాహనంలో అక్కడికి వెళ్లారు. తిరిగి తాడిపత్రికి వచ్చే క్రమంలో అర్జాస్ కర్మాగారం సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

ఈ ఘటనలో హేమలత(50), సుబ్బయ్య(51), వెంకట రంగయ్యలు మృతి చెందారు. డ్రైవర్ తో సహా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరాల్సిన వారు విగత జీవులుగా మారటంతో బంధువులు రోధించారు.

ABOUT THE AUTHOR

...view details