నిర్మల్ జిల్లా భైంసా మండలం సిద్దూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో దొంగతనం జరిగింది. ఇంటి యజమానులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లగా... దుండగులు ఇళ్లలోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు,. ఇంట్లో ఉన్న బీరువాను పగులగొట్టి 2 తులాల బంగారం, 15 తులాల వెండి, 15వేల నగదును అపహరించారు.
తాళం వేసిన ఇళ్లకు కన్నం వేసిన దొంగలు - రెండిళ్లలో చోరీ
తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్లిన ఘటన నిర్మల్ జిల్లా సిద్దూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తాళం వేసిన ఇళ్లకు కన్నం వేసిన దొంగలు
మరో ఇంట్లో బీరువాను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని డాగ్‌స్వ్కాడ్, క్లూస్ టీమ్‌లతో కలిసి విచారణ చేపట్టారు.