హైదరాబాద్ చంద్రాయనగుట్ట ఠాణా పరిధి రాజీవ్గాంధీనగర్లోని సాయిబాబా దేవాలయంలో దొంగతనం జరిగింది. దేవాలయం తాళం పగలగొట్టిన దుండగులు రెండు హుండీలను ఎత్తుకెళ్లారు.
సాయిబాబా ఆలయంలో చోరీ... రెండు హుండీలు అపహరణ - తెలంగాణ నేర వార్తలు
దేవాలయం తాళాలు పగలగొట్టి హుండీలు ఎత్తుకెళ్లిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో జరిగింది. చంద్రాయనగుట్ట ఠాణా పరిధి రాజీవ్ గాంధీనగర్లోని సాయిబాబా దేవాలయంలో చోరీ చేసిన దుండగులు రెండు హుండీలు ఎత్తుకెళ్లారు.
సాయిబాబా ఆలయంలో చోరీ... రెండు హుండీలు అపహరణ
రోజు మాదిరిగానే ఆలయ పూజారి తలుపులు తెరిచేందుకు రాగా.. అప్పటికే ద్వారం తాళాలు పగలగొట్టి ఉన్నాయి. రెండు హుండీలు కనిపించకపోయేసరికి ఆలయ సెక్రెటరీకి సమాచారం అదించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్టీంలను రంగంలోకి దింపారు. దొంగలు ఎత్తుకెళ్లిన హుండీల్లో సుమారు రూ.90 వేలు ఉండొచ్చని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి:శ్రీశైలం ప్రమాదం గురించి అప్పుడే ఏం చెప్పలేం: మంత్రి జగదీశ్ రెడ్డి