దారుణం: భర్తపై అనుమానంతో భార్య యాసిడ్ దాడి - Wife Acid Attack on Husband in Suryapeta District
08:57 November 28
దారుణం: భర్తపై అనుమానంతో భార్య యాసిడ్ దాడి
వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్తపై భార్య యాసిడ్ పోసిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. కోదాడ శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన నర్సింహరావు-లక్ష్మి దంపతులకు కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
మానసిక పరిస్థితి సరిగాలేక భర్తపై యాసిడ్ దాడి చేసినట్లు తెలిపారు. వేరే మహిళతో సన్నిహితంగా ఉండడాన్ని తట్టుకోలేక నర్సింహరావుపై యాసిడ్ పోయడంతో ఎడమ కంట్లో పడింది. అది గమనించిన స్థానికులు బాధితున్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.