మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వెంకట్రామ థియేటర్ సమీపంలో రాజా అనే వ్యక్తి మీ సేవా కేంద్రం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వివిధ పనుల నిమిత్తం మీ సేవాకు వచ్చే అమ్మాయిల ఫోన్ నెంబర్లను తీసుకుని.. మెసేజ్లు పెడుతూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఓ అమ్మాయి తరుఫు కుటుంబ సభ్యులు అతనిపై నిఘా పెట్టారు.
అమ్మాయిలను వేధిస్తున్న వ్యక్తికి దేహశుద్ధి - మహబూబాబాద్ జిల్లా తాజా వార్తలు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వెంకట్రామ థియేటర్ సమీపంలో అమ్మాయిలను వేధిస్తున్న ఓ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
అమ్మాయిలను వేధిస్తున్న వ్యక్తికి దేహశుద్ధి
శనివారం రాత్రి మీ సేవా కేంద్రం మూసి వేసి వస్తున్న రాజాను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీచూడండి: మాస్కుల పేరుతో 30 లక్షలు కొట్టేశారు.. ముఖం చాటేశారు