మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామానికి చెందిన కుమ్మరి స్వామి(40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జాగీలాలతో ఆధారాలు సేకరించారు. మృతుని భార్య గొడవపడి ఏడేళ్లుగా అతనికి దూరంగా ఉంటోంది. అతను మద్యానికి బానిసై రోజు కుటుంబసభ్యులతో గొడవపడేవాడని పోలీసులు వెల్లడించారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - మెదక్ జిల్లా తాజా సమాచారం
అతని భార్య గొడవపడి ఏడేళ్లుగా దూరంగా ఉంటోంది. తాను మద్యానికి బానిసై ఇంట్లో వాళ్లతో రోజు తగాదా పెట్టుకునేవాడు. ఈ పరిణామాల మధ్య ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. మృతుని తండ్రి గ్రామస్థులకు ఫోన్ చేసి కుమారుడు ఎలా ఉన్నాడని ఆరా తీయగా పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కొద్ది రోజులుగా అతని తండ్రితో వివాదం వల్ల ఘర్షణ పడేవారని పోలీసులు తెలిపారు. మృతుని తండ్రి కల్వకుంటలోని తన కూతురి వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి గ్రామస్థులకు ఫోన్ చేసి తన కుమారుడు ఎలా ఉన్నాడో చూసి రమ్మని ఆరా తీశాడు. సమాచారం అతనికి ఎలా తెలిసిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.