సాధారణ పౌరులే కాదు పోలీసులనూ సైబర్ మోసగాళ్లు వదలడం లేదు. తనకు డబ్బు అవసరం ఉందని స్నేహితుడు కోరడంతో హైదరాబాద్‌లోని కానిస్టేబుల్ జనార్దన్ గౌడ్ గూగుల్‌పే నుంచి రెండు దఫాలుగా ప్రయత్నం చేశారు.
మొదటిసారి నగదు వెళ్లింది. రెండోసారి సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదంటూ సందేశం వచ్చింది. వెంటనే ఆయన గూగుల్ పేలో అన్వేషించి కస్టమర్ కేర్ నంబర్ సేకరించి... ఫోన్ చేశారు. కొద్ది సేపటికే మరో నంబర్ నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. తాను గూగుల్ కస్టమర్ ప్రతినిధినని... మీ డబ్బు వెనక్కి వస్తుందంటూ భరోసా ఇచ్చారు. తాను చెప్పినట్లుగా చేయాలంటూ... గూగుల్ పే నంబర్, పిన్ నంబర్ తెలుసుకొని 50వేలు కాజేశాడు.