తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

12 రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం

అప్పుల బాధతో మనస్థాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న కేసులో 12 రోజుల తర్వాత మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన రామాయంపేట మండల పరిధి ప్రగతి ధర్మారంలో గురువారం వెలుగుచూసింది.

12 రోజులుగా అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
12 రోజులుగా అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం

By

Published : Aug 21, 2020, 12:40 PM IST

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఉడత స్వామి అదృశ్యమై 12 రోజుల తర్వాత శవమై కనిపించాడు. అప్పుల బాధతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

రూ.1.50 లక్షల అప్పు...

పంట సాగు కోసం స్వామి ఆరు నెలల క్రితం బోర్ వేశాడు. ఆ సమయంలో రూ.1.50 లక్షల వరకు అప్పు చేశాడు. కొద్ది రోజుల క్రితం బోరు మోటర్​ను పైకి తీసేందుకు చేసిన ప్రయత్నం విఫలయత్నమైంది. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన స్వామి సుమారు 12 రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.

గుట్టల ప్రాంతంలో...

అనంతరం ఆయన పొలం సమీపంలోని గుట్టల ప్రాంతంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని ఎస్సై మహేందర్ తెలిపారు. గురువారం సమీపంలోని రైతులు పొలాల వద్దకు వెళ్లడంతో విషయం వెలుగు చూసింది. 12 రోజుల తర్వాత గుర్తించడంతో మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది.

అందుకే పెద్దగా పట్టించుకోలేదు...

మృతుడు కొన్ని సందర్భాల్లో ఇంట్లో నుంచి వెళ్లి కొన్ని రోజులు తర్వాత వచ్చేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన గురించి పెద్దగా పట్టించుకోలేదన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

ఇవీ చూడండి : మొక్కజొన్న దిగుమతులపై స్పష్టతనివ్వండి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details