ఎగువ నుంచి వస్తున్న వరదతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయం జలకళను సంతరించుకుంది. ఫలితంగా జలాశయానికి సందర్శకుల తాకిడి పెరిగింది. ఈనెల 23న మహబూబ్‌నగర్‌లోని న్యూమోతీనగర్ నుంచి స్నేహితుడు రఘుతో కలిసి జలాశయ సందర్శనకు వచ్చిన కృష్ణ అనే వ్యక్తి నీటిప్రవాహంలో కొట్టుకుపోయాడు.
జూరాల జలాశయంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
ఈ నెల 23న జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయ సందర్శనకు వచ్చి వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడి మృతదేహం లభ్యమైంది. మంగళవారం ఉదయం ప్రాజెక్టు సమీపంలోని పుష్కరఘాట్ వద్ద లభించినట్లు ఆత్మకూరు ఎస్సై ముత్తయ్య తెలిపారు.
జూరాల జలాశయంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
కృష్ణ బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. రెండ్రోజుల నుంచి కృష్ణ కోసం గాలిస్తున్న గజఈతగాళ్లకు మంగళవారం.. వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని జూరాల పుష్కరఘాట్ వద్ద మృతదేహం లభ్యమైంది. ఘటనాస్థలాన్ని వనపర్తి డీఎస్పీ కిరణ్ కుమార్ సందర్శించి వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.