తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పొలంలోనే టేకు దుంగల అపహరణ.. రైతుల ఆవేదన

రోజురోజుకూ దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. పొలంలోని పంటకు రక్షణ కరవవుతోంది. రాత్రికి రాత్రే లక్షల విలువ చేసే టేకు దుంగలు అపహరణకు గురయ్యాయి. నాగర్​ కర్నూల్ జిల్లా ఏన్మన్ బెట్లలో రైతులు పదేళ్ల పాటు పెంచిన టేకు దుంగలను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టుకుపోయారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

teak trees Abduction in nagarkurnool district
పొలంలోని టేకు దుంగలు అపహరణ.. రైతుల ఆవేదన

By

Published : Sep 30, 2020, 2:33 PM IST

రైతుల పంటకు పొలంలోనూ రక్షణ కరవవుతోంది. రాత్రికి రాత్రే పదేళ్లపాటు పెంచిన టేకు చెట్లను నరికి దుంగలను అపహరించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఏన్మన్ బెట్లలో రాత్రిపూట సుమారు రూ.లక్షల విలువ చేసే టేకు దుంగలను గుర్తుతెలియని దుండగులు కొట్టుకుపోయారు. బెవిని వెంకటయ్య, బెవిని పురుషోత్తం అనే రైతుల వ్యవసాయ పొలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతులు విచారం వ్యక్తం చేశారు.

న్యాయం చేయండి

పదేళ్ల పాటు పెంచిన చెట్లను నరికి దుంగలను తీసుకెళ్లారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:గండి చెరువులో గుర్తు తెలియని శవం లభ్యం

ABOUT THE AUTHOR

...view details