గంజాయి దందాలో విద్యార్థులు - POLICE
హైదరాబాద్ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా చెలరేగిపోతుంది. విద్యార్థులు వ్యాపారుల అవుతారమెత్తుతున్నారు. ఏడాదిగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ దందాకు టాస్క్ఫోర్స్ అధికారులు చెక్ పెట్టారు. జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు ముఠాలను అరెస్ట్ చేసి విచారించారు.
హైదరాబాద్ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా
తాజాగా ఈ నెల నాలుగున మాదన్నపేటలో అయిదుగురు విద్యార్థులను టాస్క్ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 42 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో నిందితుల నుంచి తీసుకున్న చరవాణిలోని నంబర్లను పరిశీలించగా ఎక్కువగా విద్యార్థులు ఉన్నట్లు తేలింది. ఏడాది కాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యాపారం చేస్తున్నట్లు బహిర్గతమైంది. పదుల సంఖ్యలో గంజాయి వ్యాపారులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేల్చిన ఎక్సైజ్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.