తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

యువకుడు హతం.. తండ్రే చంపాడంటున్న సోదరుడు! - పంగిడిగుడెంలో తండ్రి చేత కొడుకు హత్య

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తండ్రే.. తన సోదరుడిని హతమార్చాడని మృతుడి అన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన 5 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

యువకుడు హతం.. తండ్రే చంపాడంటున్న సోదరుడు!
యువకుడు హతం.. తండ్రే చంపాడంటున్న సోదరుడు!

By

Published : Feb 3, 2021, 7:39 AM IST

Updated : Feb 3, 2021, 8:08 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో.. ప్రేమ్ కుమార్ అనే యువకుడు ఇటీవల మరణించాడు. అతనికి తండ్రి రామిరెడ్డి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ విషయంపై.. మృతుడి సోదరుడు సోమిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తన తండ్రి రామిరెడ్డే.. ప్రేమ్ కుమార్​ను హతమార్చాడని ఫిర్యాదు చేశారు. మొదటి భార్య చనిపోయిన తర్వాత రామిరెడ్డి రెండో వివాహం చేసుకుని మొదటి సంతానాన్ని నిర్లక్ష్యం చేశాడని.. ఈ క్రమంలోనే ప్రేమ్​తో గొడవ పడి చంపేశాడని ఫిర్యాదులో సోమిరెడ్డి పేర్కొన్నారు.

అంతే కాక.. ప్రేమ్ కుమార్​కు కామెర్లు వచ్చాయని అబద్ధం చెప్పి అంత్యక్రియలను పూర్తి చేశాడని పోలీసులకు చెప్పారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టు మార్టం చేయించారు. నివేదిక వచ్చాక.. ప్రేమ్ కుమార్ మృతికి కారణాలు తెలుస్తాయని చెప్పారు.

ఇదీ చదవండి:తెలంగాణ:సూర్యాపేటలో స్థిరాస్తి వ్యాపారి దారుణ హత్య

Last Updated : Feb 3, 2021, 8:08 AM IST

ABOUT THE AUTHOR

...view details