మాడ కృష్ణారెడ్డి తన స్నేహితుడు పెండ్లి రవిందర్తో కలిసి బొమ్మ తుపాకితో తండ్రి డాకారెడ్డిని చంపుతానని బెదిరించాడు. రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నిందితులు అనుమానాస్పదంగా తిరగడం గమనించి విచారించగా అసలు విషయం బయట పడింది.
గన్తో తండ్రిని బ్లాక్‌మెయిల్ - son
మద్యానికి బానిసయ్యాడు ఆ కుమారుడు. మద్యం సేవించేందుకు డబ్బుల కోసం ఏకంగా తండ్రినే బొమ్మ తుపాకితో బ్లాక్‌మెయిల్ చేశాడు. ఇందుకు సహకరించాడు ఓ స్నేహితుడు. ఎట్టకేలకు పోలీసులు ఆ ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై క్రిష్ణారెడ్డి తెలిపారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో చోటు చేసుకుంది.
గన్
విశాఖపట్నంలో గుర్తు తెలియని లారీ డ్రైవర్ దగ్గర నుంచి బొమ్మ తుపాకిని వెయ్యి రూపాయలకు కొనుగోలు చేసినట్లు కృష్ణారెడ్డి వెల్లడించాడు. పోలీసులు బొమ్మ తుపాకి స్వాధీనం చేసుకోని.. నిందితులను రిమాండ్కు తరలించారు.