యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో అభిలాష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న అభిలాష్... లాక్డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోం ద్వారా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం విధుల నుంచి తొలగిస్తున్నట్టు సమాచారం వచ్చింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై... మణికట్టు కోసుకొని, ఉరి వేసుకొని ఆత్యహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు పట్టణంలో దర్జీలుగా పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మణికట్టు కోసుకొని ఆపై ఉరి వేసుకొని.. యువకుడి ఆత్మహత్య - సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
ఉద్యోగం పోయిందని మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన... యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మణికట్టు కోసుకొని ఆపై ఉరి వేసుకొని.. యువకుడి ఆత్మహత్య