తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రెండు కార్లు ఢీ... ఆరుగురికి తీవ్ర గాయాలు - కవేలి చౌరస్తాలో కారు ప్రమాదం

అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు... ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా కోహిర్​ మండలం కవేలి జంక్షన్​ వద్ద జరిగింది.

six injured in car accident at kaveli junction
six injured in car accident at kaveli junction

By

Published : Nov 24, 2020, 5:54 PM IST

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కవేలి చౌరస్తా సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 65 నంబర్ జాతీయ రహదారిపై జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు అతివేగంతో వెళ్తున్న కారు డివైడర్​ దాటుకొని ఎదురుగా వస్తున్న మరో కారును వేగంగా ఢీ కొట్టింది.

రెండు కార్లు ఢీ... ఆరుగురికి తీవ్ర గాయాలు
రెండు కార్లు ఢీ... ఆరుగురికి తీవ్ర గాయాలు

ఈ ఘటనలో రెండు కార్లలోని ప్రయాణికుల్లో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన జహీరాబాద్​లోని వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం వల్ల రోడ్డుపై పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జాతీయ రహదారిపై రాకపోకలను పునరుద్ధరించారు.

ఇదీ చూడండి: ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు.. కారు దగ్ధం

ABOUT THE AUTHOR

...view details