భూపాలపల్లిలో ఆరుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణంలోని కృష్ణ కాలనీ సింగరేణి టీ 2 క్వార్టర్స్‌లో పేకాట ఆడుతున్న ఆరుగురు సింగరేణి ఉద్యోగులను సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 16,600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
భూపాలపల్లిలో ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ - జయశంకర్ భూపాలపల్లి జిల్లా నేర వార్తలు
భూపాలపల్లిలో ఆరుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.16,600 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ వాసుదేవరావు వెల్లడించారు.
భూపాలపల్లిలో 6 పేకాటరాయుళ్ల అరెస్ట్
ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వాసుదేవరావు పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగుల్లో కార్మిక సంఘ నాయకులు ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి:రాజేంద్రనగర్‌లో మరో కిడ్నాప్ కలకలం
Last Updated : Oct 28, 2020, 2:53 PM IST