ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 6 ట్రాక్టర్లను మహబూబాబాద్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
మానుకోటలో ఆరు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత - మహబూబాబాద్‌లో ఇసుక ట్రాక్టర్ల సీజ్ వార్తలు
మహబూబాబాద్ జిల్లాలో ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. సరైన అనుమతి పత్రాలు లేకపోవడం వల్ల వాహనాలను సీజ్ చేశారు.
ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 6 ట్రాక్టర్ల సీజ్
మహబూబాబాద్ పట్టణ శివారులో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అటుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్లను ఆపి కాగితాలను పరిశీలించగా.. వారి వద్ద ఎలాంటి అనుమతులు లేవు. ఫలితంగా వాహనాలను సీజ్ చేశారు. స్థానిక ఆకేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రమేశ్ కుమార్ హెచ్చరించారు.